అందువల్ల ప్రయాణకులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒకపక్క మూత్ర విసర్జనశాల లేకపోవడం. మరో పక్క బయటకు వెళ్లడంతో బస్టాండ్ మైదానంలో కంపు కొడుతుందని వాటికి తోడు వర్షాలు కురవడంతో బస్టాండ్ చుట్టూ మురికి నీళ్లు నిలచడంతో దుర్వాసనతో ప్రయాణకులు. ప్రజలు. షాపు యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. నెలలు గడుస్తున్న మూత్ర విసర్జనశాల గురించి అధికారులు కానీ. సంబంధించిన కాంట్రాక్టర్ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. మూత్ర విసర్జనశాల లేకపోవడంతో రాత్రి వేళలో బస్సులకు వచ్చిన ప్రయాణకులు బయటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపున కంప చెట్లు. మరో వైపున మురికి కంపుతో అవస్థలు పడుతున్నారు. బద్వేల్ ఆర్టీసీ డిఎం పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ కు పర్యవేక్షణలో భాగంగా ఎన్నోసార్లు వచ్చారు. కానీ వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. బస్టాండ్ చుట్టూ మురికి. మరియు అపరిశుభ్రతగా ఉండడంతో ఈ దుర్వాసనకు వ్యాధులు సంభవించే పరిస్థితి ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణికులకు మూత్ర విసర్జన శాల ను నిర్మించి ప్రయాణకులు ఆరు బయట మైదానానికి వెళ్లకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది.
0 Comments