వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లో దసరా పండుగ సందర్భంగా గురువారం పోలీసులు వాడే తుపాకులకు, వాడే వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించారు. సిఐ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమంలో ఏఎస్ఐ మూర్తి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులురెడ్డి. మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. దుర్గామాత కరుణా కటాక్షాలు పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించడం జరిగింది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం అలనాటి నుంచి వస్తున్న సాంప్రదాయం. సమాజంలో చెడును పారదోలెందుకు పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పోలీసు అధికారులకు సిబ్బందికి మరియు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
0 Comments