వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని పుల్లివీడు గ్రామపంచాయతీలోని సచివాలయానికి తమ కార్యాలయానికి విధులకు రాకుండా ఎగనామం పెట్టారు. వివరాలు వెళితే: పోరుమామిళ్ల మండలంలోని పుల్లివీడు గ్రామపంచాయతీ సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీ. డిజిటల్ అసిస్టెంట్. ఏఎన్ఎం. అసిస్టెంట్ ఇంజనీర్. వీఆర్వో. మహిళా పోలీస్. తదితర సిబ్బంది సచివాలయంలో విధులు నిర్వహించవలసి ఉంది. కానీ బుధవారం ఏ ఒక్క సిబ్బంది కూడా విధులకు వచ్చిన పాపనా పోలేదు. సిబ్బంది మొత్తం విధులకు ఎగనామం పెట్టారు. ఒకపక్క సచివాలయానికి తాళాలు. మరో పక్క సిబ్బంది విధులకు రాకపోవడంతో పలు సమస్యలపై వచ్చిన ప్రజలు కార్యాలయానికి వేసిన తాళాలు చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో సచివాలయంలోని సిబ్బంది సక్రమంగా విధులకు వెళ్లకుండా డుమ్ము కొడుతున్నారు. సచివాలయం సిబ్బంది సక్రమంగా విధులకు వస్తున్నారా. లేదా అనే విషయంపై సంబంధించిన పంచాయతీ సెక్రెటరీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ సెక్రటరీ కూడా విధులకు సక్రమంగా రావడంలేదని. అందువల్ల సిబ్బంది కూడా సక్రమంగా విధులకు రావడంలేదని పంచాయతీలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోరుమామిళ్ల మండలంలో ని 17 గ్రామపంచాయతీలో ఉన్న సచివాలయాలను సంబంధించిన ఎంపీడీవో పర్యవేక్షణ లేక పోవడంతో సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది విధులకు పోవడం లేదని తెలుస్తుంది. ఇప్పటికైనా మండల అధికారులు సచివాలయాలపై పర్యవేక్షణ చేసి విధులకు సిబ్బందిపై చర్యలు తీసుకువచ్చిన బాధ్యత ఎంతైనా ఉంది.
0 Comments