google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 ఒక సచివాలయం ఉద్యోగి మరో సచివాలయంలో విధులు..

ఒక సచివాలయం ఉద్యోగి మరో సచివాలయంలో విధులు..

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని సంచర్ల గ్రామ పంచాయతీ సచివాలయంలో విధులు నిర్వహించవలసిన డిజిటల్ అసిస్టెంట్ సరిత రంగసముద్రం గ్రామ పంచాయతీలోని సచివాలయం 1 లో విధులను నిర్వహిస్తున్నారు. అందువల్ల సంచర్ల పంచాయతీలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. వివరాలకు వెళ్లితే: గత మూడు నెలల క్రితం జరిగిన బదిలీలో భాగంగా పోరుమామిళ్ల మండలంలోని సంచర్ల గ్రామ పంచాయతీ సచివాలయానికి డిజిటల్ అసిస్టెంట్ గా సరిత విధులకు అయ్యారు. కానీ ఆమె సంచర్ల సచివాలయంలో విధులు నిర్వహించవలసి ఉంది. కానీ అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటీషన్ కూడా లేకుండా ఏకంగా రంగసముద్రం గ్రామపంచాయతీ 1 లో విధులు నిర్వహిస్తున్నారు. అందువల్ల సంచర్ల పంచాయతీలోని ప్రజలు డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో భూములకు సంబంధించిన వన్ బి. అడంగల్. తో పాటు క్యాస్ట్. సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో దాదాపు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న పోరుమామిళ్ల పట్టణంలోని రంగసముద్రం పంచాయితీ సచివాలయానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారుల పనితీరు లోపంతో ఒక సచివాలయంలో పనిచేయవలసిన డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగి మరో పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నారు. పేరుకు మాత్రమే సంచర్ల పంచాయతీ. విధులు నిర్వహించేది రంగసముద్రం పంచాయతీలో నిర్వహిస్తున్నారు. డిప్యూటేషన్ కూడా లేకుండా ప్రభుత్వా బంధనలను ఉల్లంఘిస్తూ విధులను నిర్వహిస్తున్నారు. కానీ సంబంధించిన మండల అధికారులు పట్టించుకోవడం లేదు. సంచర్ల పంచాయతీలో విధులు నిర్వహించకుండా. డిప్యూటీషన్ పై కూడా వెళ్లకుండా మరో పంచాయతీ అయినా రంగసముద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ అసిస్టెంట్ సరిత ది సొంత నివాసం పోరుమామిళ్ల పట్టణం కాబట్టి ఏ పాటికైనా తమ సొంత గ్రామంలో ఉండాలని ఉద్దేశంతో రాజకీయం ఉపయోగించి రంగసముద్రం సచివాలయంలో విధులను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఇంత తతంగం జరుగు తున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టించుకోకపోవడం ఆంతర్యం ఏమిటి రాజకీయాలు అడ్డుస్తున్నాయా. లేక ముడుపులు తీసుకొని సూచి చూడ్డానికి వ్యవహరిస్తున్నారా అనే అంశంపై ప్రజల్లో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారులు చర్యలు తీసుకొని సంచర్ల పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది.

Post a Comment

0 Comments