వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల మండలంలోని ఆర్టిసి బస్టాండ్ ను గురువారం బద్వేల్ డిఎం నిరంజన్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ మైదానంలో ఉన్న మట్టిని జెసిబి తో తొలగిస్తామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రయాణకులు. మూత్ర విసర్జనల కోసం ఆర్టీసీ మైదానానికి వెళ్లకుండా ఆర్టీసీ బస్టాండ్ మరమత్తులకోసం పగలగొట్టిన మూత్ర విసర్జన శాల ను త్వరలో నిర్మిస్తామన్నారు. బస్టాండ్ మైదానంలో ఉన్న కంపచెట్లను. మురికిని తొలగిస్తామన్నారు. అపరిశుభ్రంగా లేకుండా శుభ్రంగా ఉండే విధంగా చేస్తానని ఆయన వివరించారు. అదేవిధంగా ఆర్టిసి ఆవరణలో వాహనాలు పెట్టకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి అరికట్టాలని ఆయన అన్నారు ఈ విషయాలపై ఆర్టీసీ కంట్రోలర్ జమాల్ భాష కు అప్పచెప్పానని ఆయన అన్నారు. అనంతరం ఆవరణలో అపరి శుభ్రంగా ఉన్న మురికి మట్టిని తొలగించారు.
0 Comments