వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: రైతుల అభివృదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని. రైతులు అధైర్యపడవద్దని. ప్రభుత్వం అండగా ఉంటుందని వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన ఈ క్రాప్ చేయించుకున్న రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన అన్నారు. బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండల లో దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వాటి ద్వారా రైతుల ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు.అదేవిధంగా గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో కూడా పలు ధాన్యాలను కొనుగోలు చేస్తుందన్నారు.ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. మద్దతు ధరలకు పంటలు అమ్ముకోవాలంటే తప్పనిసరిగా ఈ-పంట చేసుకొని ఉండాలని ఆయన సూచించారు.ధాన్యం నిల్వ ఉంచేందుకు నియోజవర్గంలో గోడౌన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు.ప్రతి రైతులు దాన్యం అమ్ముకోవాలంటే వారికి సంబంధించిన రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదించాలన్నారు. ఇకపై రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించదన్న బెంగ పడవలసిన అవసరము లేదన్నారు. 2025-26 ఖరీప్ సీజన్ ప్రారంభానికి ముందే వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటన చేసిందన్నారు.కావున రైతులు ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.
0 Comments