వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని భూమిలేని ప్రతి పేదవాడికి అసైన్మెంట్ ద్వారా పట్టా ఇప్పించడమే నా లక్ష్యమని మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు.
బ్రహ్మంగారి మఠం మండలంలో విచ్చలవిడిగా బోగస్ ఆన్లైన్లో జరిగాయని.మండల అభివృద్ధి కార్యాలయంలో రెవిన్యూ అధికారులతో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మంగారిమఠం మండలంలో భూములు లేనిటు వంటి పేదవారు చాలామంది ఉన్నారని
గతంలో రెవెన్యూ కార్యాలయంలో పనిచేసిన కొందరు అధికారులు డబ్బులు తీసుకొని విచ్చలవిడిగా భోగస్ ఆన్లైన్లు చేయడం జరిగిందన్నారు. బోగస్ ఆన్లైన్ లు, భూ కబ్జాదారుల నుండి భూములను పేదలకు పంచాలని ఆలోచనతో అసెంబ్లీ సమావేశంలో ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగినది అన్నారు.జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో కలెక్టర్ స్పందించి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేయడం జరిగినది అన్నారు.స్పెషల్ అధికారికి విఆర్వోలు సహకరించకపోవడంతో భూ కబ్జాలను వెలికి తీయడం లో నిర్లక్ష్యం జరిగిందన్నారు.
ఒక నెలలో భూ కబ్జాలు, బోగస్ ఆన్లైన్ లో వెలికి తీసేందుకు కోసం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.
కొందరు నా దృష్టికి తెచ్చినటువంటి వివరాల మేరకు 2450 మంది బోగస్ ఆన్లైన్లో ద్వారా భూములను ఎక్కించుకోవడం జరిగినదని
4890 ఎకరాలు బోగస్ ఆన్లైన్లో జరిగినట్లుగా నా దృష్టికి రావడం జరిగిందన్నారు.
నా దృష్టికి వచ్చిన వివరాలే ఇలా ఉంటే అధికారులు నిక్కచ్చితగా సర్వే చేసి విచారణ చేసినట్టయితే వేల ఎకరాల ప్రభుత్వ భూమి భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వం తీసుకొని భూమిలేని పేదలకు పంచడానికి అవకాశం ఉంటుందన్నారు. కొందరు వ్యక్తులు తాహసిల్దారు సంతకాలనే ఫోర్జరీ చేసి డీకేటి పట్టాలు పాస్ పుస్తకాలు సృష్టించి విచ్చలవిడిగా ఆన్లైన్ చేసినట్లుగా తెలిసిందన్నారు.
అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో కి తెలిపారు. తక్షణమే రెవెన్యూ అధికారులు నెల రోజుల్లోపు కమిటీలుగా ఏర్పాటు చేసుకొని భూ ఆక్రమణలను వెలికి తీసి రిపోర్టు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా భూ ఆక్రమణలు వెలికి తీయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన వెంటనే నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం బ్రహ్మ సాగర్ ను ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పరిశీలించారు.బ్రహ్మ సాగర్ లో నీటి నిల్వ పై ఆయన అడిగి తెలుసుకున్నారు. అధికారుల వివరాల మేరకు బ్రహ్మ సాగర్లో ప్రస్తుతం నీటి నిలువ15.3టీఎంసీలుఉన్నాయని.కుడికాలువకు 100 క్యూసెక్కుల నీరు వెళుతున్నాయని.
ఎడమ కాలవకు 250 క్యూ నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు తెలియజేశారు.బ్రహ్మ సాగర్ లోకి వస్తున్నటువంటి నీరు 2000 క్యూసెక్కులు అని అధికారులు తెలిపారు. బ్రహ్మ సాగర్ లీకేజీని కూడా ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీవో చంద్రమౌళి, బ్రహ్మంగారిమఠం తాహసిల్దారు కార్తీక్, స్పెషల్ ఆఫీసర్ శిరీష, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, వీఆర్వోలు, సర్వేర్లు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, టిడిపి నాయకులు ఎస్ఆర్ శ్రీనివాసులురెడ్డి, పోలిరెడ్డి, కానాల మల్లికార్జున్ రెడ్డి, చిలమల నారాయణ, తదితర నాయకులు పాల్గొన్నారు.
0 Comments