వైయస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. రైతులు లక్షల్లో అప్పులు చేసి పంటలు వేసుకున్నా, వర్షం వల్ల అన్నీ నీటి పాలు అయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేలు అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాధ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాశినాయన మండలంలోని చిన్నాయపల్లె, కోడిగుడ్లపాడు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన ఉల్లి రైతులను కలిసి వారి బాధలు తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి, వెంటనే ప్రభుత్వం సహాయం అందించాలని ఆయన అధికారులను కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి బద్వేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు
విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గతంలో జగన్ గారు రైతులకు నేరుగా ఇన్సూరెన్స్ చెల్లింపులు చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించారు.కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
0 Comments