google.com, pub-7984519998562318, DIRECT, f08c47fec0942fa0 భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.. ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి.

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.. ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి.

వైయస్సార్ కడప జిల్లా. పోరుమామిళ్ల: తుఫాను ప్రభావంతో భారీ వర్షాల కారణంగా రైతులు పెట్టిన పంటలు చేతికి అందక. ఎండబెట్టిన ధాన్యం తడిసి చెడిపోయాయని. అందువల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని. నిద్ర మత్తులో ఉన్న కూటమి ప్రభుత్వం కళ్ళు తెరచి రైతులను ఆదుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి. బద్వేలు నియోజకవర్గ యువ నాయకుడు. మరియు రాష్ట్ర విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి. లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం పోరుమామిళ్ల మండలంలోని టేకురుపేట,    రాజసాహెబ్ పేట, తిరువెంగళపురం, చిన్నయరసాల, టేకుర్. మరియు సమీప గ్రామాలను సందర్శించి రైతులను పరామర్శించారు. అనంతరం చెడిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ గత వారం
 రోజులుగా నిరంతరంగా కురుస్తున్న వర్షం కారణంగా, రైతులు ఎండబెట్టిన ధాన్యం పూర్తిగా చెడిపోయింది. అదనంగా, మొక్కజొన్న కంకులు కూడా మొలకలు వచ్చి పంటకు భారీ నష్టం కలిగించాయి. రైతులు తమ కష్టపడి పెంచిన పంటను చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.వర్షం వల్ల ఎండబెట్టిన ధాన్యం చెడిపోయింది, అలాగే మొక్కజొన్న కంకులు కూడా మొలకలు రావడం వల్ల పంట నష్టం తీవ్రమైనది. ప్రభుత్వం వెంటనే పంటను కొనుగోలు చేసి, రైతులనష్టానికి లోనుకాకుండా చేయాలి ఆయన డిమాండ్ చేశారు.
గతంలో ఇలాంటివిధ పరిస్థితుల్లో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిసరాలను పరిశీలించి, రైతులకు తక్షణ సహాయం అందించారు. రైతు భరోసా సెంటర్లు, గ్రామ సచివాలయాల ఆర్బికే సెంటర్లు, ఇన్పుట్ సబ్సిడీలు, ఎరువులు, విత్తనాలు సరసమైన ధరలకు అందించడం, ఫ్రీ ఇన్సూరెన్స్, నష్టపోయిన రైతులకు భీమా వంటి సౌకర్యాలు రైతుల సంక్షోభ సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించడంలో ప్రత్యేకత చూపించారని ఆయన అన్నారు.ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం రంగానికి ప్రాధాన్యత ఇచ్చి .వ్యవసాయం దండగ. విధానాన్ని ప్రవేశపెట్టారు. రైతులకు ప్రోత్సాహం కల్పించడం, పండగల వాతావరణంలో జీవించడానికి అవకాశాలు ఇవ్వడం స్ఫూర్తిదాయకం. అయితే, రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు, డ్రైవింగ్ యంత్రాలు ఇంకా అందడం లేదని. లేకుంటే పంట నష్టం తప్పదని ధాన్యం వాసనతో పాడవుతుందన్నారు.వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణ
 నష్టపరిహారం ఇవ్వాలని.ఎండబెట్టిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.పత్తి, మిరప, ఉల్లి మరియు మొక్కజొన్న పంటల రైతులను ప్రత్యేకంగా ఆదుకోవాలి వ్యవసాయ శాఖ అధికారులు, బద్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన అన్నారు.పంటను నిల్వ చేసేందుకు తగిన గోడౌన్లు, డ్రైవింగ్ యంత్రాలు ఏర్పాటు చేయాలని సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో ఆయన ఫోన్ ద్వారా సంప్రదించారు. ఈ మేరకు అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేపడతారని ఆశాజనకంగా తెలిపారు.రైతుల సంక్షోభం తీవ్రమైనది. పెద్ద ఆర్థిక నష్టం మరియు సమాజంలో సమస్యలు రాకుండా, ప్రభుత్వం తక్షణమే కృషి చేసి, అవసరమైన సహాయాన్ని అందించాలని ఆయన అభ్యర్థించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలనివైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతుల ఆర్థిక పరిస్థితిని రక్షించాలనే ముద్దపూర్వక విజ్ఞప్తితో, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు  సీఎం భాష.రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు, జిల్లా మేధావులు విభాగం ఎగ్జిక్యూటివ్ నెంబర్ గాజులపల్లె రవిచంద్ర రెడ్డి, రంగసముద్రం ఉపసర్పంచ్ రుద్రవరం ప్రసాద్, పార్టీ నాయకులు కల్లూరి రామిరెడ్డి, బిజి వేముల పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, రుద్రవరం రాము, షేక్ మస్తాన్, హరిచంద్ర రెడ్డి, మాలాద్రి, పుల్లారెడ్డి, హుస్సేన్, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు చాపాటి సాయి నారాయణరెడ్డి. పార్టీ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments