వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు పోరుమామిళ్ల గ్రంథాలయంలో జరిగే 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జయప్రదం చేయాలని లైబ్రేరియన్ ఆఫ్రిది, జె.వి.వి జిల్లా కార్యదర్శి ఖాసింవల్లి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, క్రీడా పోటీలను నిర్వహిస్తామన్నారు. విజేతలకు వారోత్సవాల చివరి రోజు నవంబర్ 20న బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాటకులు పవన్ కుమార్, పుల్లివీడు గఫార్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దాదా పీర్ తదితరులు పాల్గొన్నారుop
0 Comments