ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల కరెస్పాండెంట్. రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి. పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని ఆయన 1889 నవంబర్ నెల 14వ తేదీన తండ్రి మోతిలాల్ నెహ్రూ. తల్లి స్వరూప రాణి. గార్లకు ఆయన జన్మించడం జరిగింది. భారతదేశపు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ప్రముఖులలో ఒకరు పండిట్ జవలాల్ నెహ్రూ అని ఆయన అన్నారు. భారత దేశానికి 17 సంవత్సరాలు ప్రధానిగా పని చేస్తూ ప్రాణాలు వదిలారు.దేశం కోసం అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని. నేటి బాలురే రేపటి పౌరులని ఆయన అన్నారు.
అందుకే ఆయన పుట్టిన రోజును జాతీయ బాలల దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతున్నదని. ఆయన తర్వాత కుమార్తె ఇందిరా గాంధీ. మరియు రాజీవ్ గాంధీ. దేశం కోసం ప్రాణాలర్పించారని వారి త్యాగాలను భారత ప్రజలు ఎన్నడు మరువలేరని. నేడు మన భారతదేశంలో అల్లళ్లను విధ్వంసాలను.మానవ బాంబులను తయారుచేసి మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే దానికి మన పక్కనున్న పాకిస్తాన్ మొదటి నుండి తీవ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశంలోకి అక్రమంగా పంపడం జరుగుతుంది. పహల్గాం. మరియు. ఢిల్లీలో జరిగిన మరణ హోమం. భారత్ లో డాక్టర్లుగా పనిచేస్తూ మానవ బాంబులుగా తయారై మనుషులను చంపడం. విష ద్రవ్యాన్ని తయారుచేసి వేలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను తీసేదానికి భారీ కుట్ర జరిగిందని దీన్ని వెంటనే ప్రభుత్వం వర్గాలు గుర్తించి విఫలం చేశాయని. దేశంలో భిన్న భాషలు .భిన్న సంస్కృతులు. భిన్న మతాలు.భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన భారతదేశం అని. మన దేశంలో ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రపంచంలో ఎక్కడా లేవని. ప్రపంచంలోని ముస్లిం దేశాలలో. షియా లు. సునీలు . అని వాళ్లు వాళ్లే ఆధిపత్యం కొరకు.ఏళ్ల తరబడి పోరాటం చేస్తూ లక్షలాదిమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. నేటి యువత .ఈ దేశం నాకేమిచ్చింది అనేది కాకుండా. నేను ఈ దేశానికి ఏం చేశాను అని గుర్తుంచుకోవాలని. యువత తప్పుడు మార్గంలో నడవకుండా దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కోరిక కూడా అదేనని నాగార్జున రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు. విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments