రైతులు రబీ సీజన్ లో విత్తన శుద్ధి చేసిన విత్తనాలు నాటుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్ రైతులకు సూచించారు. వైయస్సార్ కడప జిల్లా. కలసపాడు మండలం లోని రాజుపాలెం.బ్రమ్మనపల్లి గ్రామంలో పొలంపిలుస్తుంది అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ కుమార్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు వరి పంట కొత సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.రబీ సీజన్ లో వేసుకొనే పంటలు ముందస్తు చర్యలో గా విత్తనశుద్ధి చేసిన విత్తనాలు నాటు కోవాలని రైతులకు సూచించారు. కచ్చితంగా ఈ పంటనమోదు చేసుకోవాలని అదే విధంగా యూరియా వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం పద్ధతులు ఆచరించి ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చని ఆయన రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాజుపాలెం గ్రామ వ్యవసాయ సహాయకులు హర్షవర్ధన్. ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments