ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ అధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకై శనివారం వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రామిరెడ్డి ఆధ్వర్యంలో “జాబ్ మేళా” జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ మాట్లాడతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే జాబ్ మేళ లక్ష్యమన్నారు. ప్రతినెలలో జాబ్ మేళాజిల్లాలోని అన్ని ప్రాంతాలలో జాబ్ మేళా నివర్వహిచడం జరుగుతుందని,విద్యార్హతలకు అనుగుణంగా ఈ జాబ్ మేళాకు హాజరై మీకు నచ్చిన ఉద్యోగంలో స్థిరపడాలని అన్నారు. అదేవిధంగా జిల్లా నైపుణ్యథికారి విజయ్ వినయ్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతి. యువకులకు ప్రభుత్వం జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందరూ సద్వినియోగం చేసుకోవలని ఆయన తెలిపారు. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామిరెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళాలో 12 కంపెనీలు పాల్గొన్నాయని దాదాపు 315 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో మొత్తం 136 మంది ఎన్నికయ్యారని,ఎన్నికైన వారికి ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలు అందించారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యామరియు స్కిల్ సెంటర్ శిక్షకులు మోహన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments