మన హక్కులను కాపాడుకోవాలంటే బహుజనులు ముందుకు రావాలని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్రయ్య యాదవ్ పిలుపునిచ్చారు. వైయస్సార్ కడప జిల్లా. కాశి నాయన మండలంలోని చెన్నవరం గ్రామ సమీపములో ని సగిలేరు నది ఒడ్డున వెలిసిన శివాలయ ప్రాంగణంలో బీసీ యాదవ సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూల గ్రామాల సైతం యాదవ సంఘం ఆధ్వర్యంలో భక్తులు. ప్రజలు. అభిమానులు. నాయకులు మహిళలు. భారీగా తరలివచ్చారు.
ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్రయ్య యాదవ్. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బహుజనులు అందరిని ఏకం చేసి వారి హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఏకమైనప్పుడే మన హక్కులను కాపాడుకోవచ్చు అని. అందుకు బహుజనులు ఐకమత్యంతో ముందుకు రావాలని ఆయన కోరారు.
0 Comments